రాయలసీమలో జగన్ దెబ్బకు కుదైలన టీడీపీ ఇప్పుడు బిజేపీ దెబ్బకు పూర్తిగా ఖాళీ కానుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎన్నడూ లేనంతగా తుడిచిపెట్టుకుపో వడంతో ఆ పార్టీ నేతల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదైలంది. ఇక ఏపీలో వైసీపీకి బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనే ఆలోచన‌లో ఉన్న బీజేపీ అధిష్టానం టీడీపీని బలహీనపర్చడం ద్వారా తాము క్షేత్రస్థాయిలో బలపడాలని భావిస్తోంది. దీంతో మోదీ, అమిత్‌షా ద్వయం రాంమాధవ్‌ను రంగంలోకి దింపింది. బిజేపీ ఆపరేషన్ టీడీపీలో భాగంగా రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితర మాజీ ఎమ్మెల్యేలు  త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.


2019 సార్వత్రిక  ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది. 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌ గెలుపొందారు. జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధించింది. ఒకపక్క చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం, మరోవైపు లోకేష్‌ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కలవరం చెందుతున్నారు.

సీఎంగా వైయస్ జగన్‌ పాలనలో 40 ఏళ్లు అనుభవాన్ని తలదన్నేలా కేవలం వారం రోజుల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకోవడం, పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం, రైతు భరోసా, పింఛన్లు, ఆశావర్కర్లకు వేతనాలు..ఇలా పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుండడంతో వైయస్ జగన్‌పై ప్రజల్లో భరోసా ఏర్పడుతోంది. దీంతో  జగన్ కనీసం పదేళ్లు  అధికారంలో ఉంటాడని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటే తమ రాజకీయజీవితానికి శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పడినట్లు అని టీడీపీ నేతలు ఆందోళనలో పడ్డారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుపై అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీలో చేరే అవకాశం లేదని గ్రహించిన అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పార్టీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  


ఈ సార్వత్రిక ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాలను నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా జగన్ సునామీ ముందు వారు ఘోరంగా ఓడిపోయారు. ఇక జగన్‌ ఉండగా చంద్రబాబు టీడీపీని అధికారంలోకి తీసుకు రావడం అసంభవం అని జేసీ బ్రదర్స్ భావిస్తున్నారు. దీంతో తాము క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను బిజేపీలోకి పంపాలని జేసీ బ్రదర్స్ నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో ఇప్పటికే చర్చలు కూడా జరిపించినట్లు విశ్వసనీయ సమాచారం. జేసీ ఫ్యామిలీ ఈ నెల 12న  ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఒక వేళ అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరకకపోతే మరో తేదిని ఎంపిక చేసుకుని బీజేపీలోకి జేసీ ఫ్యామిలీ చేరడం ఖాయమని తెలుస్తోంది.  ఇక జేసీ బ్రదర్స్ తర్వాత మాజీ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చేరిక విషయంలో రాంమాధవ్‌ వీరితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జేసీ ఫ్యామిలీ చేరిక తర్వాత వీరిద్దరు ఈ నెల 23 న లేదా 27న కానీ  బీజేపీలో చేరుతారని అనంతపురం టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
 ఇక అనంతపురం టీడీపీలో శక్తివంతమైన పరిటాల కుటుంబం కూడా బీజేపీ బాట పట్టడం అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. అసలు పరిటాల రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య అనంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం చంద్రబాబు పూర్తిగా బలహీనపడిన వేళ..వీరు టీడీపీలో ఉండడం అనవసరం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా బలీయమైన శక్తిగా అవతరించిన వైసీపీని ఎదుర్కోవాలన్నా, టీడీపీ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో చిక్కుకోకుండా ఉండాలన్నా,  తమకు జాతీయ పార్టీ అండ ఉంటే బెటర్ అని పరిటాల ఫ్యామిలీ భావిస్తుందంట.

అందుకే బీజేపీలో చేరేందుకు పరిటాల ఫ్యామిలీ కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? కేడర్‌ తమతో వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో సునీత, శ్రీరామ్‌లు  ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ను ఒప్పించి బీజేపీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్, పల్లె, సూరి చేరికల తర్వాత పరిటాల కుటుంబం బీజేపీలో చేరే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు కూడా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని, వారు కూడా ఎవరిదారి వారు చూసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ..మొత్తంగా జగన్ సునామీకి అనంతపురం జిల్లాలో టీడీపీ కోట బద్ధలు అయిపోతే..జేసీ, పరిటాల వంటి బలమైన నేతలను తమ పార్టీలో కలుపుకుని బిజేపీ టీడీపీకి చితి పేరుస్తోంది. వైయస్ జగన్ పాపం టీడీపి అని సైలెంట్‌గా ఉంటే ..కమలనాథులు మాత్రం కొనవూపిరితో ఉన్న టీడీపీని పూర్తిగా చచ్చిపోయేలా పావులు కదుపుతోంది. మొత్తానికి జగన్ అఖండ విజయం టీడీపీ చావుకు, బిజేపీకి వరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: