టీడీపీల అధినేత  చంద్రబాబు ఇపుడు ఓటమి భారంతో ఉన్నారు. అయినా ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. రాజకీయ వ్యూహాలు పన్నడంతో ఆయనకు ఆయనే సాటి. అటువంటి బాబు హఠాత్తుగా గవర్నర్ నరసిమ్హన్ తో భేటీ వేశారు. ఏకంగా యాభై నిముషాల సేపు మంతనాలు  జరిపారు. రేపే వైసీపీ మంత్రుల ప్రమాణం.


మరి ఈ కీలక సమయంలో గవర్నర్ తో బాబు ఏం మాట్లాడిఉంటారు, నిజానికి బాబు సీఎం గా ఉండగా గవర్నర్ తో సత్సబంధాలు  కొనసాగించిన దాఖలాలు లేవు. ఆయన్ని ఎపుడూ అనుమానిస్తూ అవమానిస్తూ మాట్లాడేవారు. ఇక తన రాజీనామా కూడా గవర్నర్ కి నేరుగా కలసి ఇవ్వకుండా దూత ద్వారా పంపించేశారు. ఫలితాలు వచ్చిన ఇన్నాళ్ళ తరువాత ఇపుడు బాబుకు గవర్నర్ గుర్తుకు రావడం విశేషమే.


అదీ ఓ వైపు వైసీపీ మంత్రుల ప్రమాణంగా ఎంచుకున్న  ముహూర్తం  బాబుకు కూడా అదే టైం బాబుకు కూడా అవసరం అయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అసలు బాబు గవర్నర్తో  అంతసేపు ఏం మాట్లాడి వుంటారన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. గవర్నర్ ఓ వైపు కేసీయార్ కి, కేంద్రంలోకి మోడీకి, ఇంకో వైపు జగన్ కి కూడా సన్నిహితంగా ఉంటున్నారు. మరి గవర్నర్ ద్వారా ఏదైన రాయబారం పంపారా. లేక గవర్నర్ నుంచి కేంద్రం ఆలోచనలు ఎలా వున్నాయన్నది  తెలుసుకున్నారా అన్నది చర్చగా ఉంది.


ఇక  ఈ ఇద్దరూ కలసి  తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారని అంటున్నారు. మరి అవేంటో ఎవరో ఒకరు చెబితే తప్ప బయటకు రావు కదా. ఇది మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ నాయకులు  అంటున్నా  బాబు వంటి వారు వూరకే తీరి కూర్ఛుని పరామర్శలు   చేయరన్నది తలపండిన రాజకీయ నేతలు అంటున్నారు. చూడాలి ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: