అధికారమే పరమావధిగా మారిన రాజకీయంలో ఏ ఎండకు ఆ గొడుకు పట్టడమే నాయకులకు తెలుసు. పదవి లేకపోతే బతకలేమనుకున్న వారు. ఎన్నికల్లో భారీగా సొమ్ము ఖర్చు చేసి పార్టీ ఓటమిపాలు అయిన వారు గోడ దూకడమే బెటర్ అనుకుంటారు.


అటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ అధినేత జగన్ రెడీ అంటున్నారు. తాను ఫిరాయింపులను ఎట్టిపరిస్తితుల్లోనూ ఏపీలో జరగనివ్వనని భరోసా ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైన ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారితే మాత్రం వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని కూడా జగన్ గట్టిగా కొత్త స్పీకర్ తమ్మినేనిని కోరారు. 


దీంతో టీడీపీ తమ్ముళ్ళకు పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లైంది. అయితే వైసీపీ లేకపోతే బీజేపీలోకి మారాలని చూస్తున్న వారంతా ఇపుడు దిక్కు తోచక ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ విధంగా గోడ దూకకుండా అడ్డంగా గేట్ వేసేసి  అసలైన కాపాలా తానేనని  జగన్  చెప్పకనే చెప్పారు. ఇపుడు ఓ విధంగా చంద్రబాబే జగన్ కి థాంక్స్ చెప్పాలేమో. అంతమంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో బాబు కనిపించడానికి ఓ విధంగా జగన్ సాయం చేస్తున్నాడు అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: