సెక్యురిటీ చెక్ విషయంలో జరుగుతున్న గందరగోళంపై అసెంబ్లీలో చంద్రబాబునాయుడు పరువు పోయింది.  గన్నవరం విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం చంద్రబాబును మామూలు ప్యాసెంజర్ వాహనంలోనే విమానం వరకూ తరలించారట. అంతకుముందు విమానాశ్రయంలోకి ఎంటర్ అయ్యే సమయంలో సెక్యురిటీ చెక్ చేశారట.

 

దాంతో అదేదో కొంప ముణిగిపోయే అంశం అయిపోయినట్లు, చంద్రబాబుకు తీరని అవమానం జరిగినట్లు టిడిపి ఒకటే గోల గోల చేసేస్తోంది. రెండు రోజులుగా ఇదే విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇపుడు అదే అంశంపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది.

 

చంద్రబాబు సెక్యురిటీ చెక్ అంశాన్ని అనవసరంగా టిడిపి సభ్యులు సభలో లేవనెత్తారు.  చంద్రబాబు సెక్యురిటి చెక్ కు రాష్ట్రప్రభుత్వానికి ఏమీ సంబంధం లేకపోయినా టిడిపి ఓవర్ యాక్షన్ చేసింది. దాంతో వైసిపి సభ్యులు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి వాయించేశారు. అంతకుముందే ఎంఎల్ఏలు అంబటి, భూమన కూడా దుమ్ము దులిపేశారు.

 

ముఖ్యమంత్రి హోదాకు, మాజీ ముఖ్యమంత్రి హోదాకు సెక్యురిటిలో తేడాలుంటాయన్నారు. మాజీ సిఎం అయిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఎటువంటి మినహాయింపులుండవని స్పష్టం చేశారు. అసలు విమానాశ్రయంలో చంద్రబాబును చెక్ చేయటానికి రాష్ట్రప్రభుత్వానికి సంబంధం ఏమిటో చెప్పాలంటూ దుమ్ము దులిపేశారు. దాంతో టిడిపి నుండి మళ్ళీ గొంతు లేవలేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: