జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. ఫోర్జరీ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణకు సహకరించకుండా గరుడపురాణం శివాజీ ఎదురుతిరిగారు.  టివి 9 సంస్ధకు సంబంధించి 40 వేల షేర్లను టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ నుండి కొనుక్కునే విషయంలో ఫోర్జరీ డాక్యుమెంట్ల సృష్టిలో  శివాజీ పోలీసు కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 

విచారణకు హాజరవ్వాలంటూ సైబరాబాద్ పోలీసులు ఎన్ని నోటీసులిచ్చినా శివాజీ లెక్క చేయలేదు. చిరవకు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపధ్యంలోనే అమెరికాకు వెళ్ళేందుకు  శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న గరుడపురాణాన్ని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

 

ఇక్కడే పోలీసులు తప్పు చేశారని ఇపుడు అనిపిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విచారణకు రావాలంటూ శివాజీకి నోటిసిచ్చి విడిచిపెట్టేశారు. అంటే తాను విచారణకు హాజరవుతానని శివాజీ హామీ ఇచ్చిన తర్వాతే విడిచిపెట్టారు లేండి.

 

అయితే ఎప్పుడైతే పోలీసులు విడిచిపెట్టేశారో అప్పటి నుండి శివాజీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుండి మళ్ళీ పోలీసులకు సహకరించలేదు. పైగా తన కొడుకు అడ్మిషన్ బిజీలో ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని ఓ మెయిల్ ద్వారా సమాచారం పంపారు. అంటే శివాజీ తీరు చూస్తుంటే పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా లేనట్లు అర్ధమైపోతోంది. శివాజీని నమ్మి విడిచిపెట్టి పోలీసులు తప్పు చేశారనే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: