' పదిమంది మెచ్చే పథకాల్ని ప్రవేశపెట్టడం, వాటిని సుస్థిరపరచడం, ఆనక విస్తరించడం, అవి సమర్థంగా అమలు చేయడం...' ఇవే చాణక్యుడు చెప్పిన నాలుగు సూత్రాలు అంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన తన బడ్జెట్‌ ప్రసంగం చివరలో కొసమెరుపుగా అన్నారు.

వైఎస్‌ఆర్‌ పేరున్న పథకాలు దాదాపు ఏడు , జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన అనే పథకాలు రెండు జగన్‌ పేరుతో ఉన్నాయి . తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు న్యాయం చేసేందుకు బడ్జెట్‌లో ప్రయత్నించారు. అయితే ఈ బడ్జెట్‌ సందర్భంగా ప్రస్ధావించిన ఒక్క పథకం మాత్రం ఒక సంచలనం అని, అని అపుడే సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. వైఎస్‌ మరణించాక ఆరోగ్యశ్రీని ఏ ముఖ్యమంత్రీ సరిగ్గా పట్టించుకోలేదన్నది అందరికీ తెలిసిందే. హైదరాబాదులోని స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను కూడా ఏపీ ప్రజలకు దూరం చేశారు.


ఈ స్థితిలో వై.ఎస్‌ . జగన్‌ దీని పరిధిని విస్తరించి, ఆరోగ్యశ్రీ పథకానికి మార్పులు చేశారు. ఏటా 5 లక్షల ఆదాయం పున్న ప్రతి కుటుంబానికీ దీన్ని వర్తింపజేస్తానని ప్రకటించాడు.దీనిని ఈ బడ్జెట్‌లోనూ ప్రముఖంగా ప్రస్తావించారు ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్ర ప్రసాద్‌. అంటే నెలకు 40 వేల ఆదాయం ఉన్న మధ్యతరగతికీ ఓ భరోసా ఇచ్చారు. అంతేకాదు, ఇంతకుముందు రకరకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగించారు కానీ ఇప్పుడు 1000 రూపాయలు మించి ఖర్చయిన ప్రతి బిల్లునూ ప్రభుత్వమే భరిస్తుందని తేల్చేసి చెప్పారు.

అంతేకాదు, హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై హాస్పిటల్స్‌ను కూడా ఆరోగ్యశ్రీ చెయిన్‌లోకి తీసుకొస్తున్నారు. వీటికితోడు ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన 108 అంబులెన్సుల్ని కూడా దారిలో పెడుతున్నారు. కొత్త అంబులెన్సుల కొనుగోలు ప్లస్‌ ప్రతి మండలానికీ ఒక 108 అనేది గొప్ప నిర్ణయం.


'' ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ చూశాక, ప్రభుత్వం చెప్పినట్టే, ఎక్కడా లొసుగులు లేకుండా, అమలు చేస్తే....పదే పదే జగన్‌ గారు కోరుకుంటున్నట్టు, ప్రతీ ఇంట్లో వై.ఎస్‌.ఫోటో పక్కనే కాదు,దేవుడి పటం పక్కనే ఆయన ఫోటో కూడా ఉంటుంది...'' అని విజయనగరం జిల్లాకు చెందిన రాజునాయుడు అనే చిరుద్యోగి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: