ఈ మధ్యనే కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబడిన లడక్ సరిహద్దు ప్రదేశాలలో ఉన్న పాకిస్తాన్ ప్రాంతానికి ఉన్నట్టు ఉండి యుద్ధ విమానాలు వచ్చి వాలాయి. దాంతో పాటుగా సైన్యాన్ని డెప్లాయ్ చేయడం వాళ్ళు ప్రారంభించారు.  క్రమంగా ఆ ప్రాంతమంతా కూడా సైన్యంతో నిండిపోతోంది. భారత దేశం ముందుగానే ఈ పరిణామాల్ని ఊహించుకుని సరిహద్దు ప్రాంతాలలో తన సైన్యంతో సిద్ధంగా ఉంది.


సైన్యం దగ్గర బ్యాటిల్ యాక్షన్ ఫోర్స్ విత్ వెపన్స్ తో రెడీగా ఉంది. పాకిస్తాన్ నుంచి అనుమానాస్పదంగా ఏమైనా వస్తే యుద్దానికి భారత దేశం సిద్ధంగా ఉంది.  వాళ్ళు ఒక్క బాంబు భారత్ వైపు  వేస్తె, భారత దేశం  వంద బాంబుల వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా చూసుకున్న యుద్దానికి భారత దేశం  అన్ని ఆయుధాలతో సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయి.

అదే సమయంలో ఒక్క విమానం పాకిస్తాన్ నుంచి పైకి లేచి భారత దేశం వైపు వస్తుంది అంటే ఇటు వైపు నుండి బోర్డర్ దగ్గర పది విమానాలు గాలిలోకి  వెళ్ళి వాళ్ళ వ్యవస్థలను కుప్ప కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విముక్తి కలిగించడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. దీనిని బట్టి చూస్తుంటే భారత్ అని విధాలా సిద్ధంగా ఉంది అని పాకిస్తాన్ కి ఇంకా అర్థం అయినట్టు లేదు. అందుకే వాళ్ళు వళ్ళ సైన్యాన్ని బోర్డర్ లో దించింది.

ఈ విషయం తెలిసిన అమెరికా మరియు చైనాలు పాకిస్తాన్ కి  సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాయి. " బార్డర్ దగ్గరి కి సైన్యాన్ని తీసుకు వెళ్లి దుస్సాహసం చేయవద్దు,  మీ సైన్యాన్ని అక్కడి నుండీ వెనక్కి తీసుకోని మీ చెడు ఆలోచనలను ఉపసంహరించుకోండి, ఉద్రిక్తతల ఏ మాత్రం రెచ్చగొట్టొద్దు, ఏ చిన్న దుస్సాహసం జరిగినా వినాశనం మాత్రం అంచనా వేయలేము అని, మీరు మీ దేశాన్ని (పాకిస్తాన్) దీర్ఘకాలికంగా కోలుకోలేని దారుణ పరిస్థితికి తీసుకెళ్లకండి ఎందుకంటే భారత్ యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉంది" అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: