టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె గత 15 రోజులుగా జరుగుతున్న విషయం విదితమే. అయితే ఈ సమ్మెకి సంబంధించి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. అయితే బంద్ అంత కూడా ప్రశాంతంగా జరిగింది. అయితే ఈ బంద్ విజయవంతం అయ్యింది. ఈ బంద్ కి ప్రతి పార్టీలు అన్ని సహకరించాయి. దీంతో ఆర్టీసీ బంద్ కి సహకరించిన పార్టీలకు, అందరికి ఆర్టీసీ జేఏసీ నాయకులూ ధన్యవాదాలు తెలిపారు.        

                          

కాగా గయపడ్డ పోటు రంగారావును జేఏసీ నాయకులూ పరామర్శించారు. కాగా రేపు అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో సమావేశం అవ్వనున్నారు. ఆ ప్రతిపక్ష పార్టీ నేతల వద్ద వారి భాదను చెప్పుకోనున్నారు. కాగా ఈ నెల 23వ తేదీన ఓయూలో బహిరంగా సభను ఏర్పాటు చెయ్యనున్నారు. కాగా అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యి అందరూ ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇచ్చేలా చేసేలా చర్చలు నిర్వహించాలని జేఏసీ నాయకులూ అనుకునుటున్నారు.     

                           

అయితే ఆర్టీసీ కార్మికులు 15 రోజుల సమ్మె కారణంగా ఇంట్లోవారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు వారు వాపోతున్నారు. కాగా ఈరోజు రాష్ట్రమంతటా సమ్మె కారణంగా ప్రజలు అంత తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రోజంతా క్యాబ్లు, బస్సులు అన్ని బంద్ కావడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి ఎలాంటి స్పందన లేదు. కాగా సోమవారం నుండి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. 

                   

మరింత సమాచారం తెలుసుకోండి: