తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? అంటూ శ్రీశ్రీ ప్రశ్నిస్తే కానీ మనకి శ్రామిక శక్తీ , ఆ శక్తి చాటున జరుగుతున్న దోపిడీ గురించి ఒక ఐడియా రాలేదు. ప్రపంచం నివ్వెరపోయే రీతి లో అమరావతి రాజధాని ని నలభై వేల ఎకరాల్లో నిర్మిస్తున్నారు అంటే మనం కూడా అమరావతి నిర్మాణం లో అసలు కదం తొక్కుతున్న కూలీలు ఎవరు అని మనం కూడా ప్రశ్నించుకోవాలి మరి. కొన్ని వేల రైతుల కుటుంబాలు , మధ్యతరగతి కుటుంబాలూ రాజధాని కోసం గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోకుండా తమ భూములు ఇచ్చేసారు కాబట్టి ఇవాళ రాజధాని నిర్మాణం అంతా చక్కగా సాగుతోంది. 

చంద్రబాబు ప్రభుత్వం కూడా శంకుస్థాపన మహోత్సవం


చంద్రబాబు ప్రభుత్వం కూడా శంకుస్థాపన మహోత్సవం లో వారికి గొప్ప స్థానం ఇవ్వబోతోంది. మంచి గా వారిని సత్కరించబోతున్నారు. కొత్త బట్టలు ఇచ్చి వారికి తమ సంతోషాన్ని తెలియజేయబోతోంది ప్రభుత్వం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది, పండగ పూట, శంకుస్థాపన రోజు కాదు ఈ కొత్త బట్టలు ఇచ్చేది. రైతుల కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి వారికి ఆ రోజు అంత హడావిడి లో ఈ బట్టలు ఇవ్వడం కుదరదు కాబట్టి, ఇన్విటేషన్లతో పాటూ ఇంటివద్దకే కొత్త ధోవతి, కొత్త కండువా, చీరెలను కూండా పంపుతున్నారు. ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన వస్త్రాను రైతులకు అందజేస్తున్నారు. 


అయితే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేప్పుడు ఆ రైతుకుటుంబాల వారంతా ఆ నూతన వస్త్రాలను ధరించి రావాలని కూడా ఒక కండిషన్‌లాగా చెబుతున్నారు. వారు రావడం వల్ల నష్టమా లాభమా అనేది బాబు సన్నిహితులు వేస్తున్న బేరీజు. వారిని ఆహ్వానించకుండా కార్యక్రమం చేపడితే పరువు పోతుంది అలాగని ఆహ్వానిస్తే వారి జీవితాల్లో, వారి బతుకుల్లో ఉండే దారిద్య్రం మొత్తం.. అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, దేశాల ప్రతినిధులు వచ్చే ఈ కార్యక్రమంలో బాహాటంగా బయటపడితే కూడా.. అదేదో దిష్టిచుక్కలాగా ఉంటుంది.


రైతుల పరిస్థితి చూసిన విదేశీ ప్రముఖులు ఇంత దీనంగా, దారిద్యం లో బ్రతుకుతున్న వారి పొలాలను లాక్కుని మరీ రాజధాని ని కట్టాల్సిన అవసరం ఏంటి అనుకుంటేనో? వామ్మో ఇంకేమన్నా ఉందా? ఎవరైనా భూమి ఇవ్వడం ఇష్టం లేని రైతు చిన్న సీన్ సృష్టిస్తే? నేషనల్ మీడియా లో అది భారీ న్యూస్ అయిపోతుంది. వారి ఆహార్యం ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? వారి దారిద్ర్యం మీద ముసుగు కప్పెయ్యాలి. అలా ముసుగు కప్పడం లో భాగంగా ఈ కొత్త బట్టలు సరఫరా చేస్తున్నారు అని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: