ఉత్తరాదిలో కాలేజీ యాజమాన్యాలు సరికొత్త వివాదానికి తెరలేపాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో కాలేజీ అమ్మాయిలు జీన్స్ వేసుకోరాదని ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా హర్యానాలోని భివాని బాలికల కళాశాల యాజమాన్యం అయితే జీన్స్ వేసుకోరాదంటూ నోటీసులు కూడా అంటించారు. యూపీలో అయితే అఖిలేష్ ప్రవేశపెట్టిన 'కన్యా విద్యాదాన్ యోజన' పథకం కింద సీఎం అఖిలేష్ యాదవ్ నుంచి ఆర్థిక సాయం పొందిన కాలేజీ అమ్మాయిలు బ్లాక్ డ్రస్ లు, టాప్స్ తో కూడిన జీన్స్ కానీ వేయరాదని, సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలని బిజనూర్ కలెక్టర్ ఆదేశించారు. రూల్స్ ఉల్లంఘించి టీషర్టులు, జీన్స్ వేసుకుని కాలేజీలకు వస్తే రూ.100 జరిమానా వసూలు చేయాలని కాలేజీలను ఆదేశించారు. అఖిలేష్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై యూపీలో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించారు. తన సూచనల్ని కిందస్థాయి అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని , అలాంటి ఆంక్షలేమి తాను పెట్టలేదని, కేవలం నిరాడంబరంగా ఉండాలని మాత్రమే ఆదేశించానన్నారు. ఈవ్ టీజీంగ్ లాంటి సమస్యలను అరికట్టాలంటే ఇటువంటి ఆంక్షలు తప్పవంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: