నిన్నటి వరకు పల్లెబాట, నగరబాట, వీటీతో ఇందిరమ్మ బాట వీటికి తోడుగా మధ్యమధ్యలో రచ్చబండ, ఫ్రజాపథాలు, గడచిన ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెసుది ఇదే బాట, అయితే ఏబాట పట్టిన ప్రజలకు ఒరిగేది ఏమీ లేకుండా పోతుందనే విమర్శలొస్తున్నాయి.  గతంలోనే మాదిరిగా పరిపాలన యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి అక్కడికక్కడే అప్పుడే వారి సమస్యలను పరిష్కరించాలని ఈసారి కూడా ముఖ్యమంత్రి, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తన పూర్వీకుల మాదిరిగా ఆలోచించారు. ఆలోచన మేరకు ఈనెల 14నుంచి మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాట కార్య్రకమాన్ని ప్రారంభించనన్నారు.  ఇక నుంచి వారంలో మూడు రోజులపాటు ఇందిరబాట పేరుతో జిల్లా పర్యటనలు చేపట్టి ప్రజలను నేరుగా కలుసుకోవాలని ముఖ్యమంత్రి యోచించారు. ధరల పెరుగుదల, విద్యత్ కొరత, అనేక సతమతం అవుతున్న రైతుల వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్న నేపధ్యంలో ఇలాంటి కార్య్రకమాలు చేపట్టడం ద్వారా పార్టి కూడా ప్రతికూల సంకేతాలు ఏర్పడగలవలని కొందరు మంత్రులు నివారించిన ముఖ్యమంత్రి ఇందిరబాటను చేపట్టాలని ధృడనిశ్ఛయంతో ఉన్నారు. ఇందిరమ్మబాట కేవలం ప్రజలను కలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే చేపట్టనున్నది కాదు జిల్లాలో పార్టీ పరిస్థితిని నియోజకవర్గాల వారిగా ఆధ్యయనం చేయాలనే ఉద్దేశ్యంతో కూడా ఈ కార్యక్రమం వెనుక ఉన్న మరో కారణం. అయితే ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొద్ది మాసాల తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం ‘‘రచ్చబండ’’ ఈ కార్యక్రమాన్ని గత ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు నిర్వహించారు.  ఈ తర్వాత రెండవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని గత ఏడాది నవంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు. అయితే మొదటి రచ్చబండ కార్యక్రమంలో ఏ మేరకు ఫెంచన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్, ఆరోగ్యశ్రీ వంటి సమస్యలపై ప్రజల నుంచి ఎన్ని లక్షల అర్జీలు స్వీకరించారో వాటిల్లో ఎన్నింటిని పరిష్కరిచారనే దానిపై పరీశీలన చేస్తే ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఉదాహరణకు రచ్చబండ మొదటి విడత కార్యక్రమంలో 34 లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం అందాయి.  అందులో 29 లక్షల 99 వేల దరఖాస్తులు అర్హత పొందగా, 14 లక్షల 43 వేల మంది దరఖాస్తు దారులు కొత్త రేషన్ కార్డలు కోసం అర్హులుగా గుర్తించారు. కానీ నేటికి ఎంతమంది అర్హత గలవారికి కొత్తరేషన్ కార్డుల అందాయన్నది అనుమానమే, అలాగే పింఛన్ల కోసం 12.88 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. హౌసింగ్ కోసం 25.75 లక్షల దరఖాస్తులు అందుకున్నారు. ఈ తర్వాత నవంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన రెండవ విడత రచ్చబండ కార్యక్రమంలో కూడా లక్షల్లోనే ప్రజల నుంచి దరఖాస్తులు అందాయి.  మరి ఇంత వరకు ఎన్ని దరఖాస్తులకు మోక్షం లభించిందో, ఎంతమంది రేషన్ కార్డులు, పింఛన్లతో జీవితాన్ని గడుపుతున్నారో తెలియదు, అయినా ఇందిరమ్మ బాట పేరుతో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో బాట చేపట్టనున్నది, మరి ఈ సారి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: