మహిళలకు సంబంధించిన కేసులు విచారించడానికి 5 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. మహిళలపై అత్యాచార కేసులను ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు విచారిస్తాయి. ఈ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు జనవరి 2న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఢిల్లీ ఘటన ఫై విచారణ ను వేగవంతం చేస్తామని మరో వైపు కేంద్రం ప్రకటించింది . 30 రోజుల్లో విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు పట్టుబడగా , దేశ వ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేసింది. ఇక విద్యార్థులు తమ ఆందోళనను విరమించాలని , ఢిల్లీ లో మహిళల భద్రతకు తాము పూచీ అని హోం మంత్రి షిండే కూడా ప్రకటించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: