కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఆర్ధిక సర్వే- 2016-17ను ప్రవేశ పెట్టారు. భారత ఆర్ధికవృద్ధి రేటు 7-7.5 శాతం ఉండే అవకాశం ఉందని ఆర్ధిక సర్వే వెల్లడించింది.

అందులోని ముఖ్యాంశాలు ఇవిగో...

* మేకిన్ ఇండియా కి మరిన్ని ప్రోత్సాహకాలు కావాలి.

* ముడి చమురు ధరలు ఈ ఏడాదంతా బ్యారల్ కు 35 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం.

* దీని వల్ల భారత ఖజానికి మేలు.

* ఇండియా లో కరెంట్ బిల్లులు తగ్గే రోజులు దగ్గరలో.

* దేశవ్యాప్తం గా విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది.

* ఇండియా లో పౌల్ట్రీ, మత్స పరిశ్రమలకు ఆదరణ.

* ఈ రెండు విభాగాలలో గణనీయమైన వృద్ధి.

* పాల ఉత్పత్తి లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఇండియా.

* మొత్తం పాలల్లో 18.5 శాతం ఇండియా లోనే.

* మొత్తం స్థూల జాతీయోత్పత్తి లో 2015/16 ద్రవ్యలోటు 3.9 శాతం.

* ఈ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమే.

* 2016/17 మన ముందు ఎన్నో సవాళ్ళను ఉంచనుంది.

* స్వల్పకాల ద్రవ్య విధానంపై సమిక్షంచాల్సిన సమయం ఇదే.

ద్రవ్యోల్బణం :

* వినియోగ సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చే ఆర్ధిక సంత్సరం లో 4.5 నుంచి 5 శాతం మధ్య కొనసాగే అవకాశం.

* తగ్గుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మేలు.

* ధరల స్థిరత్వానికి సూచిక కుడా.

* మార్చి 2017 లోగా 5 శాతం ఇన్ ప్లేషన్ లక్ష్యాన్ని ఆర్బిఐ చేరుకుంటుంది.

కరెంట్ ఖాతాల లోటు:

* జీడిపిలో కరెంట్ ఖాతాల లోటు 1 నుంచి 1.5 శాతం వరకూ ఉండే అవకాశం.

పన్నులు:

* దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలి.

* సంపాదిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లింపు జాబితాలో ఉన్నారు.

* వీరికి 20 శాతానికి చేర్చాలి.

బ్యాంకింగ్, కార్పోరేట్ రంగం:

* 2018/19 నాటికీ బ్యాంకులకు రూ.1.8 లక్షల కోట్ల మూలధనం అవసరం.

* బ్యాంకులు ఒత్తిడిలో ఉన్నాయి.

* నిరర్ధక ఆస్తుల మొత్తాన్ని తగ్గించుకాకుంటే ప్రమాదమే.

* బ్యాంకింగ్ రంగం లో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు.

* కొనసాగుతున్న డిజిన్వేస్ట్ మెంట్.

* ప్రభుత్వ సంస్థలో ప్రజల బాగస్వామ్యం పెరగాలి.

మరిన్ని ముఖ్యాంశాలు:

* గతపదేళ్ళలో హార్టికల్చర్ విభాగం 2.7 శాతం చొప్పున విస్తరించింది.

* ఆహార ధాన్యాల కన్నా మెరుగైన దిగుబడి.

* డిమాండున్న పంటల దిశగా రైతులు సాగాలి.రైతులకు నియమిత మొత్తంలో సబ్సిడీ అవసరం.

* రైతుల సబ్సిడీ మొత్తాలు నేరుగా బ్యాంకుల్లోనే జమ.

* మొత్తం సబ్సిడీ బిల్లు జీడిపి 2 శాతం కన్నా కిందకు తేవాలి.

* జాతీయ ఆహార భద్రత, స్వచ్చ భారత్ వేగావంతమవ్వాలి.

* పోషకాహారం పరిశుబ్రత దిశగా ఎన్నో మెట్లేక్కాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: