పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు ప్రభుత్వానిన తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని,. తప్పును గమనించి సరిదిద్దే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఇంజనీర్లు, అధికారులే తప్పదోవ పట్టిస్తున్నారని. వారిదే రాజ్యం కొనసాగుతున్నదని, వారి చేతుల్లో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని ఆయన విరుచుకుపడ్డారు. సిఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోవలవరం ప్రాజెక్టువిషయంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ పార్లమెంటులో ప్రకటన చేయగా, ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని పర్యావరణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా ఇక్కడ పనులు జరుగుతుండడం దురదృస్టకరమని వ్యాఖ్యానించారు. అధికారులకు సాంకేతికపరమైన అవగాహన లేకపోవడం వల్లనే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పోలవరం పనులు ఆపకపోతే పెద్దఎత్తున ఆందోళనలు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే అక్కడి గిరిజన ప్రజాప్రతినిధులు,. కాంగ్రెస్ కు చెందిన పోంగులేటి సుధాకర్ రెడ్డి ఆందోళనలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని కలసి పోలవరం ప్రాజెక్టుకు చెందిన పూర్తి వవరాలను తెలుసుకుంటానని చెప్పారు. దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా ఖర్చుకు రెండింతల వ్యయంతో కూడిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కూడా అలాంటిదేనని అది పూర్తి కాబోదని. దాని డిజైన్ మార్చాల్సిందేనని పాల్లాయి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం రద్దు : దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసిందని, త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని రాజ్యసభ సభ్యులు పాల్వాయిగోవర్థన్ రెడ్డి అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు దాదాపు రూ.30 వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నదని, ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. ఇంత చేసినా ఒక్క ఎకరం సాగుకు కూడా ప్రత్యేకంగా నీరు రాదని ఆయన వివరిస్తూ ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: