మిత్రపక్షం అయిన బీజేపీ నేతల దగ్గర నుంచీ కాంగ్రెస్, వైకాపా ఏపీ లో చంద్రబాబు మీద తీవ్రమైన ముప్పేట దాడికి దిగుతున్నారు. వామపక్షాలతో పాటు కొత్తగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా చంద్రబాబు మీద నోరు పారేసుకుంటూ మీడియా కి ఎక్కుతున్నాడు. ఇంతగా తనమీద విమర్సల దాడి జరుగుతూ ఉంటే, టీడీపీ నేతలు సరిగ్గా స్పందించకపోవడం పట్ల చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఒకరకమైన అసహనంతో ఉన్నారు అని తెలుస్తోంది.

 

 

 

 " నన్ను మాత్రమే కాదు లోకేష్ బాబు ని అన్నవారికి కూడా ప్రతి విమర్శలు ఇవ్వాల్సిందే, అందుకే కదా మీరంతా ఉన్నది. మీ నాయకుడిని అంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు ? మాటకి రెండు మాటలు ఎక్కువేసి సమాధానం చెప్పాలి కదా ? " అన్నారట చంద్రబాబు. తన పార్టీ సన్నిహితులతో బాబు ఇలా వాపోయారు అని తెలుస్తోంది. వైకాపా ఎమ్మెల్యే లు టీడీపీ లో ఎంతగా పెరుగుతున్నారో అంతగా వారు జేరుతున్న విధానం మీద టీడీపీ కి తీవ్ర విమర్శలు ఎదురు అవుతున్నాయి.

 

 

 

 

సో వాటికి ఎదురుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి మంత్రం పేరు చెప్పి ఎమ్మెల్యే లు జంప్ చేస్తున్నా వారు ఎదో ఒక లాభం ఆశించి పార్టీ లోకి రారు అనేది కచ్చితంగా చెప్పచ్చు ఈ నేపధ్యంలో బాబు జనాల్లోకి అలాంటి ఫీలింగ్ ని పంపించడానికి ఇష్టపడడం లేదు. మంత్రి వర్గ సమావేశం అనంతరం విడివిడిగా మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు, వారికి ఇదే విషయమై క్లాస్‌ తీసుకోవడంతో.. చంద్రబాబు తీరు పట్ల మంత్రుల్లోనూ అసహనం పెరుగుతోందని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: