భారత్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి. ఉగ్రావాద భాదిత దేశాల్లో భారత్ ప్రధానమైనది. భారత్ లో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పాట్నా, బీహార్, భోపాల్, లాంటి అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో ముష్కరులు మాటు వేశారు. ఎప్పుడూ ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నగరాలలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మహమ్మారిని ఓ కంట కనిపెడుతూ భారత్ సహా పొరుగు దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవసరం ఎంతైనా ఉందంటున్న వ్యాసమిది...

భారత్ పొరుగు దేశాలైన ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్ లలో సరికొత్త ఉగ్రవాద సేనా వాహిని ఏర్పాటు చేయాలని ఇస్లామిక్ రాజ్య(ఇసిస్) సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు భారీ కుట్ర పన్నిన ఈ సంస్థ, అందుకోసం పెద్ద ఎత్తున నియమకాలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఐఎస్ రూపొందించిన 32 పేజీల ఉర్దూ దస్త్రం ఇటీవల అమెరికా మీడియా సంస్థ (ఎంఎంఐ) చేజిక్కింది. అంతేకాక నిన్న ఇసిస్ కు చెందిన ఇసిస్ కు చెందిన 20 వేల యునీఫాం లను భద్రతా బలగాలు పట్టుకొన్నాయి. ఇందులో భారత్ పై యుద్ధ ప్రస్తావన ఉన్నట్లు అమెరికా వెల్లడించింది.

సైనిక సామర్థ్యానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇసిస్ తమ ఉగ్రవాద సంస్థల్ని బలోపేతం చేస్తోంది. క్షిపణులతో దాడి చేసే సామర్థ్యానికి ఇవి ఎదిగాయంటే వీటి సామర్థ్యాన్ని ఏ మాత్రం తక్కువ అంచనావేయడానికి వీలులేదు. శివరాత్రి, పార్లమెంట్ సమావేశాల సమావేశాల నేపథ్యంలో భారత్ లో భారీ స్థాయిలో ఉగ్రవాద దాడికి కుట్ర జరిగినట్లు ఆందోళనకర సమాచారం అందిందని సైనిక ఉన్నతాధికారి తెలిపారు. అయితే వీటిని నివారించడానికి అన్ని చర్యలనూ చేపట్టినట్లు భరోసా ఇచ్చారు. నేడు భద్రతా పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి.

ఉగ్రవాద చర్యల్ని అడ్డుకోవడానికి మేము ఆన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని సైన్యంలోని పశ్చిమ విభాగం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ కె.జె సింగ్ తెలిపారు. అయితే కుట్ర వివరాలను అయన వెల్లడించడానికి నిరాకరించారు. ఉగ్రవాద చర్యల్ని గట్టిగా ఎదుర్కొంటామని మీకు హామీ ఇస్తున్నాని పేర్కొన్నారు. అలాంటి దుశ్చర్యలు ఒక గొప్ప దేశాన్ని అడ్డుకోజాలవని తెలిపారు. జమ్మూలో పాకిస్తాన్ తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఒక సొరంగాన్ని కనుగొనడం వల్ల పెద్ద ఉగ్రవాద దాడి ముప్పు తప్పిందన్నారు. అలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయా అని శోధించడానికి సరిహద్దు ప్రాంతాల్లో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: