సైనిక పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్చా వాయువులు పీల్చుకొన్న ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యంలో రూపొందిన ప్రజాస్వామ్య ప్రభుత్వం సుపరిపాలన దిశగా అగుగులు వేస్తోంది. మయన్మార్ ప్రజలను సైనిక పాలన బానిస సంకెళ్లను తెంచివేసి ప్రజాస్వామ్య వాయువులను స్వేచ్చగా పీల్చేలా చేసిన ధీర వనిత ఆంగ్ సాన్ సూకీ. ఆమె మయన్మార్ లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని నెలకొల్పి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. అయినప్పటికీ సుకీకి పాలనా కష్టాలు తప్పట్లేదు.


దేశ రాజ్యాంగం సుకీని అధ్యక్ష పదవిని చేపట్టకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో, పరిపాలను సమర్థవంతంగా నిర్వహించాలనే ధృడనిశ్చయం తో ఉన్న సూకీ అధ్యక్ష పదవికి తన మాజీ కారు డ్రైవర్, సూకీ తన స్కూల్ సహచరుడు 69 ఏండ్ల హెచ్‌టిన్ క్యావ్‌ను అధ్యక్ష పదవికి నామినేట్ చేశారు.


నేడు ఉదయం మయన్మార్ పార్లమెంటు ఉభయసభల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 652 ఓట్లు పాలవగా, అధ్యక్ష స్థానం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీ ని హితిన్ క్యా సాధించారు. ఆయనకు మొత్తం 360 ఓట్లు లభించాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆమె పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం విదేశీ బంధమున్న వారు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు లేక పోవడంతో, ఆమె హితిన్ ను బరిలోకి దించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: