దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఈ రోజు హోలీ సంబరాల్లో మునిగి తేలారు. అయితే వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి పూర్తిగా విభిన్నం గత రెండేళ్లుగా సరైన వర్షాపాతం నమోదు కాకపోవడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఒక వైపు పల్లెలు నీళ్లు లేక పెల్లెలు కన్నీరు పెడుతుంటే మరో వైపు పట్నం ప్రజాలు మాత్రం నీటిని కొనుక్కొని రైన్ డ్యాన్సులు చేస్తున్నారు. ఇంతటి కరువు తెలంగాణలో విలయ తాండవం చేస్తుంటే నాయకులు మాత్రం నీటిని విచ్చలవిడిగా వృథా చేస్తున్నారు.

 

నేడు హైదరాబాద్ జిల్లాలో పలు చోట్ల ప్రజలు వెయ్యి రూపాయలు వెచ్చించి మరీ నీటి ట్యాంకరును తెప్పిచ్చుకొని మరీ రెయిన్ డ్యాన్సులు చేసి వారి సరదాలను తీర్చుకునారు. ఒకవైపు ఏమో ఒక్క బిందెడు నేటి కోసం గంటలు తరబడి నిలబడ్డా నీరు దొరకని పరిస్థితి. పల్లెల్లో మాత్రం బిందెడు నీటికోసం కొన్ని మైళ్లు దాటాల్సిన పరిస్థితి. ఇంతటి కరువుకాలంలో పట్నం ప్రజలు ప్రజల అవసరాలను తెలుసుకొని మెదలలేకపోయారు. దీనిపై సామాజిక వేత్తలు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని  బొట్టు బొట్టు నీటిని వృథా చేయకుండా ఒడిసిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి రెయిన్ డ్యాన్సులపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని తక్షణమే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలి. ఇంకా మే రానేలేదు ఇప్పటికీ రాష్ట్రం నీటి కరువుతో కొట్టుమిట్టాడుతుంది. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకొనేలా ప్రతి ఒక్కరు అవగాహనను కలిగి ఉండాలి. ఇప్పటికైనా నీటి అవసరాన్ని గుర్తించి పొదుపుగా వాడుకొంటే మన ముందు తరాల వారికి ఎటువంటి కష్టం ఉండదు


మరింత సమాచారం తెలుసుకోండి: