తెలంగాణా ఫై నెలలోగా పరిష్కారం చూపు తమన్నా హోం మంత్రి షిండే వ్యాక్యలకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తోంది . కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గట్టి నిర్ణయం తీసుకోనుందని ఆపార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో ఇవ్వాళ తెలిపారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి షిండే చేసిన ప్రకటన మేరకు నిర్ణయం తీసుకోవడానికి పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే నెల రోజుల గడవు విధించిందని ఆయన అన్న చాకో మరో 20 రోజుల సమయం ఉందని అంతలోనే కాంగ్రెస్ నిర్ణయం ప్రకటిస్తుందని అన్నారు. కౌంట్ డౌన్ మొదలయిన దరిమిలా ఈ విషయం ఫై ఢిల్లీ స్థాయిలో భారీ కసరత్తు జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: