వైకా పా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దూకుడుని పెంచింది. రెండో విడతగా జగన్ ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్ చేసింది. రూ.143 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. మనీలాండరింగ్ చట్టం కింద ఆస్తులను జప్తు చేసింది.వైఎస్ హయాంలో లబ్ది పొందిన కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే అని ఈడీ నిర్థారించింది. గతంలో మొదటి విడతగా జగతి, జననీ ఇన్‌ఫ్రాకు సంబంధించిన రూ.51.2 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మున్ముందు మరిన్ని ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాంకీ ఫార్మాసిటీకి చెందిన 133.74 కోట్ల విలువైన 135.46 ఎకరాల భూమి,3.20 కోట్ల డిపాజిట్లు, జగతి పబ్లికేషన్‌కు చెందిన రూ.10 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు, మ్యుచువల్ ఫండ్స్ నుంచి రూ.3.20 కోట్లను అటాచ్‌మెంట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈడీ దర్యాప్తులో రాంకీ ఫార్మాసిటీ క్విడ్ ప్రో బహిర్గతమయ్యింది. రూ.133.71 కోట్లకు గ్రీన్‌బెల్డ్ ఏరియాలోని భూమి అమ్మకం జరిగింది. దానికి ప్రతిగా రాంకీ చైర్మన్ అయోధ్యరామిరెడ్డి జగతిలో రూ.10 కోట్ల పెట్టుబడులను పెట్టారు. నాన్‌సెజ్ ఏరియాలో 23 ఫ్లాట్లు, సెజ్ ఏరియాలో 8 ఫాట్లు అక్రమంగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: