ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదట అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని చిరకాలం సుస్థిరం చేసుకోవడానికి సన్నద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కేసీఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్క్షేమ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజల మన్నలను చూరగొంటూ ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు తాము వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సహకరిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ కోణంలో పరిశీలించినట్లయితే, ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. టీడీపీ, వైకాపా లు తమ దుకాణాన్ని ముసుకోడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా ఎటువంటి అడ్డు లేకుండా, విజయానికి మార్గం సులువయ్యేలాగా చూసుకుంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.ఇకపోతే మిగిలింది ఒక్క కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ నాయకుల్లో ముసలం నెలకొంది. పదవుల కోసం సీనియర్ నాయకుల మధ్య సఖ్యత దెబ్బతింది. పైగా పార్టీ అధ్యక్షుడి పట్ల కూడా కొందరు నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా వాడుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది.

 

ఇప్పటికే కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిన విషయం అందరికీ విదితమే. ప్రస్తుతం పార్టీ అధినాయకత్వం,  సమర్థవంతమైన మంత్రుల ఆధ్వర్యంలో పార్టీ కారులా దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజకీయ పరంగా, ప్రజల పరంగా చూస్తే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యమని చెప్పక తప్పదు...!

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: