అమెరికా 44వ అధ్యక్షుడిగా నల్లజాతీయుడు బరాక్ ఒబామా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 51 ఏళ్ల ఒబామా చేత యూఎస్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ వైట్ హౌస్ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒబామా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ బిల్డింగ్ గా పిలిచే వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత వలయం మధ్య ప్రమాణ స్వీకార వేదిక అయిన వైట్ హౌస్ కు పెనిసెల్వేనియా అవెన్యూ నుంచి ఒబామా బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ కారులో అభిమానుల హర్ష ధ్వానాల మధ్య తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత జాతినుద్దేశించి ఒబామా ప్రసంగించారు. వచ్చే నాలుగేళ్లలో అమెరికన్ల కోసం ఏం చేయాలనుకున్నారో వివరించారు. ప్రపంచ దేశాలతో శాంతితో పాటు... పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామన్నారు. డెమోక్రాట్ పార్టీ నుంచి ఇటీవల కాలంలో వరుసగా రెండోసారి దేశాధ్యక్షుడు ఘనత ఒబామాది. అంతకుముందు అంటే 1993- 2001 వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన ఘనత బిల్ క్లింటన్ కు మాత్రమే దక్కింది. ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలపై దృష్టిపెడతామన్నారు. అందుకే అన్నట్లుగా.... 2008లో అధికారంలోకి రాగానే... ఇరాక్ నుంచి సేనలను వెనక్కి పిలిపించారు ఒబామా. త్వరలోనే ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు స్వదేశానికి రానున్నాయి. అనంతరం ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అతిథులందరికీ... ఒబామా విందు ఇచ్చారు. వివిధ దేశాలకు చెందిన నేతలు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర సెలబ్రిటీలు విందుకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: