2012 ఏప్రిల్ తర్వాత ఆర్ బిఐ మళ్లీ వడ్డీ రేటు తగ్గించింది. రెపోరేటును పావు శాతం తగ్గించింది. సీఆర్ఆర్ లో కూడా పావుశాతం తగ్గించింది. తగ్గింపు తర్వాత రెపోరేటు 7.75 శాతంగా ఉంటుంది. తగ్గింపు తర్వాత సీఆర్ఆర్ 4శాతంగా ఉంటుంది.గృహ, వాహన రుణాల ఈఎంఐలపై వడ్డీ పావుశాతం తగ్గే అవకాశం ఉంది. మార్కెట్ ఆశించింది అరశాతం కాని ఆర్ బిఐ తగ్గించింది పావుశాతం. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, హెచ్చుమీరుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్ బిఐ ఈ చర్యలను చేపట్టింది. సీఆర్ఆర్ తగ్గింపుతో వ్యవస్థలోకి 18 వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. రానున్న వారాల్లో ఈ రేటును మరింతగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: