గ‌త రెండేళ్ల కాలంలో బీజేపీ స‌ర్కార్ ను ముప్పుతిప్పలు పెడుతున్న వ‌స్తు సేవ‌ల ప‌న్ను  ( జీఎస్టీ) బిల్లు కు దాదాపుగా ఆమోదం పొందే అవ‌కాశాలు ఎక్కువ గానే క‌న‌బ‌డుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ బిల్లు నేడు రాజ్య‌స‌భ ముందుకు రానుంది. ఇప్ప‌టికే ప‌లు ధ‌పాలుగా  పార్ల‌మెంట్ ముందుకు వ‌చ్చిన ఈ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు బీజేపీ చేయ‌ని ప్ర‌యత్నం లేదు. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ప‌లు ద‌ఫాలుగా భేటీ అయ్యారు. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు బూస్టు  నిచ్చే జీఎస్టీ బిల్లుకు మ‌ద్దతును ఇవ్వాల‌ని , బిల్లులో ఏవైనా మార్పులు ఉంటే సూచిస్తే వాటిని స‌వ‌రిస్తామ‌ని కూడా మోడీ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. దీనికి కాంగ్రెస్ సైతం ఓకే చెప్పిన‌ట్లు గా తెలుస్తోంది. 

జీఎస్టీ బిల్లుకు టీడీపీ మ‌ద్దతు..

ఈ సారి ఎలాగైనా ఈ బిల్లును ఆమోదం పొంది తీరాల‌ని ప‌ట్టుద‌లతో ఉన్న మోదీ స‌ర్కార్ అందుకు అనుగుణంగా వ్యూహాలు ర‌చించినట్టుగా ఉంది. ఇందుకు ఇప్ప‌టికే త‌మ ఎంపీల‌కు విఫ్ జారీ చేసింది. ఈ క్ర‌మంలో నేడు రాజ్య‌స‌భ‌లో జ‌ర‌గ‌బోయే చ‌ర్చ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మిత్ర ప‌క్షంగా ఉంటున్న అకాలీధ‌ళ్‌, ఆర్ఎస్ఎస్ లు, టీడీపీ ఎంపీ లు పూర్తి స్థాయిలో ఈ బిల్లుకు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇక తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్ప‌టికే ఈ బిల్లు పై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చేశారు.  ఆ పార్టీ పార్ల‌మెంట్ ప‌క్ష నేత ఎంపీ వినోద్  జీఎస్టీ బిల్లుకు  మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించారు. ఇక టీడీపీ ఎంపీలు సైతం త‌మ జీఎస్టీ బిల్లుకు త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. మొత్తంమీద ఈ స‌మావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదానికి కేంద్రం తీవ్ర క‌స‌రత్తు చేస్తోంది. కొంత కాలంగా బిల్లుపై ఏర్ప‌డిన ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించే విధంగా ఇటీవ‌లే కేంద్ర కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో... ఇక రాజ్య‌స‌భ లో బీఎస్టీ బిల్ల ప్ర‌వేశ పెట్ట‌డం ఖాయ‌మైంది. 

జీఎస్టీ బిల్లు లాభం పై విశ్లేష‌ణ‌...

బిల్లుకు సంబంధించిన స‌వ‌ర‌ణ‌ల‌ను సైతం ఎంపీల‌కు అందజేశారు. అయితే బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న‌ది మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోతుంది. వాస్త‌వానికి ఈ బిల్లు ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు చేకూరుతున్న లాభం పై విశ్లేషిస్తే.... మార్కెట్లో ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌లు కొంత‌వ‌ర‌కు త‌గ్గు ముఖం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. చిన్న కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాల ధ‌ర‌లు మ‌రింత గా దిగిరానున్నాయి. గూడ్స్ స‌ర్వీసెస్ టాక్స్ బిల్లు ఆమోదం తో ఆటో రంగంలో ప్ర‌ముఖమైన ల‌బ్ధిదారుగా మార‌నుంది. 18 శాతం ప్ర‌తిపాదిక రేటు ప్ర‌కారం కార్లు ధ‌ర‌లు సామాన్యుడికి అందుబాటులోకి  రానున్నాయి. అంతేకాకుండా ఇత‌ర కమ‌ర్షియ‌ల్ వాహ‌న ధ‌ర‌లు సైతం దిగి వచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. చిన్న కార్లు ( వాహ‌నాలు పొడువు మ‌రియు ఇంజ‌న్ ప‌రిమాణం కంటే త‌క్కువ 1,200 సీసీ, డీజిల్ మోడ‌ళ్ల సిసి, ద్వీ చ‌క్ర వాహనాల‌పై ప్ర‌స్తుతం 20 శాతంగా ఉన్న ప‌న్ను రేటు 18 శాతానికి తగ్గ‌నుంది.

మారుతీ, సుజుకీ ల‌కు అనుకూలంగా ఉండనుంది

అంటే వాహనాల ధ‌ర‌ల్లో ప్ర‌స్తుతం శాతం నుంచి 7 శాతం త‌గ్గ‌నున్నాయి. అయితే 40 శాతం జీఎస్టీ రేటు ఒకే అయితే... మ‌ధ్య త‌ర‌హా కార్లు, ఎస్ యూవీ ( వాహ‌నాలు పొడువు మ‌రియు ఇంజ‌న్ ప‌రిమాణం కంటే త‌క్కువ 1,500 సీసీ) లో ప్ర‌స్తుత మిశ్ర‌మ ప‌న్ను రేటు 6 శాతానికి పెరుగ‌నుంది. పెద్ద కార్లు, ఎస్ యూవీ ల‌( 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజ‌న్ ప‌రిమాణంతో వాహ‌నాల ధ‌ర‌లు) మాత్రం య‌ధాత‌ధంగా ఉండునున్నాయి. అలాగే ట్రాక్ట‌ర్ల ధ‌ర‌ల‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేదు. 12 శాతం రేటుతో ట్రాక్ట‌ర్ల పై ప్ర‌స్తుత ఒవ‌ర్ ఆల్ టాక్స్ తో  ఎక్కువ‌గా పోలి ఉంది. ప్యాసింజ‌ర్ వాహ‌న విభాగంలోని డిమాండ్, కాంపాక్ట్ సెడాన్ మ‌రియు ఎస్ యూవీల డిమాండ్ మ‌ధ్య త‌ర‌హా, పెద్ద కార్లు లేదా ఎస్ యూవీ ల వైపు మ‌ళ్లే అవ‌కాశం లేదు. మొత్తంగా ఈ జీఎస్టీ బిల్లు ఆమోదం భార‌త‌దేశంలోని అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతీ సుజుకి, యూటిలిటీ వాహ‌నం త‌యారీ దారు ఎం అండ్ ఎం చాలా సానుకూలంగా ఉండ‌నున్నాయి. 

గృహ ప‌రికరాల ధ‌ర‌లు త‌గ్గనున్నాయి

ఇప్పటికే ఈ అంచానాల నేప‌థ్యంలో   మారుతి  సుజుకీ షేర్లు 2.61 శాతం  లాభాల‌తో రూ. 4,211 ద‌గ్గ‌ర ముగిసింది. 30 శాతం లాభాల‌తో మొద‌లైన ఎం అండ్  ఎం శాతం న‌ష్టంతో రూ 1353 ద‌గ్గ‌ర ముగిసింది. ఇదీలా ఉంటే పెట్రోలియం ఉత్ప‌త్తులు నేడు ప్రవేశ పన్ను  జీఎస్టీ వ్య‌వ‌స్థ లో భాగంగా నే ఉంటాయ‌ని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బిల్లు చ‌ట్ట‌మైతే దేశ వ్యాప్తంగా ఒకే ప‌న్ను రేటు అమ‌ల్లోకి రానుంది. ఏప్రిల్1, 2017 నుంచి అమలు లోకి  తేవాలని ప‌ట్టుద‌లగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసులు, ఎఫ్. ఎం.సి.జి రియ‌ల్ ఎస్టేట్, టూరిజం, ఆన్ లైన్ మార్కెటింగ్ త‌దిత‌ర రంగాలు ప్ర‌భావితం కాన్నున్నాయి. దీని మూలంగా ప్ర‌స్తుత అమ్మ‌క‌పు ప‌న్ను భారీగా క్షీణించేందుకు వీలుంటుంద‌ని, దీంతో ఫ్యాన్లు, ఏసీ లు, మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. 

జీఎస్టీ బిల్లు ద్వారా త‌యారి సంస్థ‌ల‌కే లాభం...

ఇక‌పోతే... ఈ బిల్లు ద్వారా వివిధ రాష్ట్రాలు విధిస్తున్న ప‌లు ర‌కాల ప‌న్నుల స్థానే రెండు మూడు ప‌న్నులే అమ‌ల్లోకి వ‌స్తాయి. దీంతో ప‌రోక్ష ప‌న్నుల వ్య‌వ‌స్థ ప‌ట్ల అంద‌రికీ స్ప‌ష్ట‌త వ‌స్తుంది. వ‌స్తువులు, సేవ‌లు, తయారీ, వినియోగం, రవాణా వంటి ప‌లు విభాగాల‌పై ప‌డుతున్న ప‌లు ర‌కాల ప‌న్నులు తొల‌గుతాయి. అమ్మ‌క‌పు ప‌న్ను, వ్యాట్, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ సుంకం త‌దిత‌ర సుంకాలు ఒకే గొడుగుకింద‌కు వ‌స్తాయి. ఇదీ ప్ర‌త్య‌క్షంగా ప‌లు రంగాల‌కు ల‌బ్ధి చేకూర్చడంతో పాటు అంతిమంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బలాన్నిస్తుంద‌ని ఎకనామిక్స్ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇదీలా ఉంటే జీఎస్టీ బిల్లు వ‌ల్ల రాష్ట్రాల‌కు రాబోయే రెవెన్యూ న‌ష్టం ప‌ట్ల ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సాధికార‌త క‌మిటీ అభ్రిప్రాయాల‌ను ఆర్ధిక మంత్రి కొత్త ముసాయిదా బిల్లును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని త‌మిళ‌నాడు రాష్ట్రం వాదిస్తోంది. మొత్త‌మీద జీఎస్టీ బిల్లు ద్వారా త‌యారి సంస్థ‌ల‌కు లాభ‌లే ఎక్కువ‌గా ఉన్నాయని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: