ఈ నెల 20లోగా కావేరీ ట్రిబ్యునల్ తుది నోటిఫికేషన్‌ను వెలువరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నది. ఈ నోటిఫికేషన్‌తో రాష్ట్రానికి అన్యాయం జరుగనున్నందున ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు కావేరీ వివాదానికి సంబంధించి వాదనల వివరాలన్నింటినీ సభకు అందచేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా బెంగళూరు, మైసూరు జిల్లాలతోపాటు కావేరీ నదీపరీవాహక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికోసం హాహాకారాలు చేస్తున్నారన్న విషయం సుప్రీంకోర్టుకు తెలియచేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. రాష్ట్ర రైతులకు, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనకుంటే సామూహిక రాజీనామాలకు సైతం సిద్ధమని జేడీఎస్‌నేత హెచ్‌డీ రేవణ్ణ ప్రకటించారు. ఈ నోటిఫికేషన్‌తో భవిష్యత్లో తమిళనాడుకు కర్ణాటక గతం కన్నా ఎక్కువగా నీరు విడుదల చెయ్యాలన్న ఊహాగానాలు బలమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: