చార్జీల పెంపుకు అలవాటు పడిన సామాన్యులకు ఇక మీదట ఇలాంటి వార్తలు సాధారనమేమో ! పెరిగిన డీజిల్ ధరల దెబ్బకు మరోసారి రైలు చార్జీల పెంపు తప్పేట్లు లేదు. రైల్వే బడ్జెట్‌లో చార్జీలను మళ్లీ పెంచుతారా అని గురువారం రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్‌ను అడుగగా బడ్జెట్ వరకు వేచి చూడండి అని సమాధానమిచ్చారు. పెంచిన రైలు చార్జీల కారణంగా రైల్వేకు రూ.6,600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశామని, అయితే డీజిల్ ధరల పెంపుతో రైల్వేపై రూ.3,300 కోట్ల అదనపు భారం పడిందని తెలిపారు. ఆదాయం పెంచుకోవడానికి చార్జీల పెంపు కూడా ఒక మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. కొత్త రైల్వే ప్రాజెక్టులకు, స్టేషన్ల అభివృద్ధికి నిధుల అవసరం ఉందన్నారు.  రైల్వే చార్జీలను పెంచుతూ బన్సల్ జనవరి 9న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పెరిగిన చార్జీలు జనవరి 21 నుంచి అమల్లోకి వచ్చాయి. జనవరి 9 ప్రకటన సందర్భంగా మంత్రి బడ్జెట్‌లో చార్జీల పెంపు ఉండదని అన్నారు. అయితే నెల తిరగకముందే మరోసారి చార్జీలు పెంచే diesసూచనలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: