త్వరలో సూర్యుడి నుంచి పెద్ద మొత్తంలో శక్తిని మోసుకొస్తున్న ఓ భారీ సౌర తుఫాను భూమిని ముంచెత్తనుంది. దీనివల్ల ఉపగ్రహాలకు నష్టం వాటిల్లడంతో పాటు భూమిమీది విద్యుత్ స్టేషన్లు, వైమానిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  దాదాపు గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొచ్చే అవకాశం ఉందని లండన్‌కు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ నిపుణులు ప్రకటించారు. అయితే అది ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేమని, కేవలం అర గంట ముందు మాత్రమే దానిని అంచనా వేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. వంద రెండు వందల ఏళ్ల కోసారి ఇలాంటి భారీ సౌర తుఫానులు వస్తాయని, 1859లో ఆ స్థాయి సౌరతుఫాను వచ్చిందని తెలిపారు. దీనిపై పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. సౌర తుఫాను వల్ల కలిగే ఇబ్బందులను ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: