వినడానికే అదోలా ఉంటే మరి మన పాలకుల 'దూరదృష్టి'ని చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. హైదరాబాద్ మహానగరంలో నిజాం కాలంలో నిర్మించిన శ్మశాన వాటికలు తప్పిస్తే కొత్తగా ఏర్పాటు చేసినవి బహు తక్కువ. ఉన్నవి కుడా పెరుగుతున్న పట్టణీకరణతో కబ్జాలకు గురవుతున్నాయి. బహుళ అంతస్థుల భవనాలూ, గేటెడ్ కమ్యూనిటీలను శ్మశానాల్లో నిర్మిస్తున్నారు. 'మహా'నగరంలోని శ్మశాన వాటికల్లో ఆరడుగుల స్థలం లభించడం కష్టమే. మరి ఇప్పుడే ఇలా ఉంటె భవిష్యత్లో జనాభా రెండు కోట్లకు చేరితే విస్తరిత ప్రాంతాల్లో పరిస్థితి చూద్దామా,భములను వివిధ అవసరాల కోసం 12 జోన్లుగా విభజిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లాన్-2031లో ఏ జోన్‌లోను వీటి గురించి పట్టించుకున్న నాథుడు లేదు. వీటి గుర్తింపు తర్వాత ఉంటుందని అధికారులు చెబుతున్నా జనాభా పెరిగే కొద్దీ ఆయా ప్రాంతాల్లో వసతుల కల్పన అంశానికి హెచ్ఎండీఏ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం రూపొందించిన ప్లాన్‌లో శ్మశాన వాటికల నిర్మాణం వంటి ప్రజావసరాలకు ప్రాధాన్యమివ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: