భారత్‌ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధిరేటు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 6.1 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దశాబ్దంలో ఎన్నడూలేని విధంగా కనిష్టస్థాయిలో 5 శాతానికి చేరుతుందని గణాంకశాఖ వంటి అధికార నిపుణులు చెపుతుండగా సంవత్సరం మధ్యభాగంలో చేపట్టిన సంస్కరణల దృష్ట్యా ఆర్ధిక వృద్ధిరేటులో గణనీయంగా పెరుగుదల ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ వంటి సంస్థలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సబ్సిడీల కోత, పెట్టుబడుల ఆకర్షణకు కసరత్తులు, పెట్టుబడుల ఉపసంహరణ, డీజిల్‌ ధరల పెంపుకు అనుమతి, పన్నుల వసూళ్లు, రెపోరేట్ల తగ్గింపుద్వారా ఆర్ధిక వ్యవస్థలో బ్యాకింగ్‌ అందుబాటులోనికి 18 వేల కోట్ల సమీకరణ. ప్రభుత్వపరంగానే 40 వేల కోట్ల నిధుల సమీకరణ వంటి అంశాలు ఆర్ధిక వృద్ధిలోటును గణనీయంగా పెంచగలవన్నది రేటింగ్‌ సంస్థల విశ్లేషణ. భారత్‌ ఆర్ధికలోటు కూడా బడ్జెట్‌లో అంచనా వేసిన విధంగా 2.1 శాతం కాకుండా 2.4 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. 2012-13లో సూచించిన విధంగా 5 శాతం కాకుండా 2014లో 6.1 శాతానికి చేరుకోలమని ఐఆర్‌వంటి సంస్థలు ప్రకటిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: