అక్టోబరు 12 వ తేదీ అది కొందరికి సాధారణ రోజు కావచ్చు.. మరికొందరికి ప్రత్యేక దినం కావచ్చు. కానీ విశాఖ వాసులకు మాత్రం జీవం ఉన్నంత వరకు మర్చి పోలేని రోజు. ఆ రోజు విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రకు అతలాకుతలం చేసిన హుద్ హుద్ వచ్చిన రోజు. అందుకే ఆ చీకటి రోజు గడిచి రెండేళ్లు అయినా జనం మాత్రం కళ్ల ముందు జరిగిన ఈ చేదు జ్ఞాపకాన్ని మర్చి పోలేక పోతున్నారు