మాల్దివుల్లోని పాలక పక్షం ప్రేరేపిత రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టును తప్పించుకునేందుకు నషీద్ గత వారం నుంచి భారత రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. నషీద్ వ్యవహారంలో ఇరు దేశాల మధ్యా తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి భారత విదేశాంగ శాఖకు చెందిన ఉన్నత స్థాయి బృందం మాలె చేరుకుంది. భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్ సమద్ అబ్దుల్లాతో నషీద్ వ్యవహారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. అలాగే వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ ఈ బృందం వేర్వేరుగా సమావేశమైంది. దీని పర్యవసానంగా మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌ను తమ ముందు హాజరుపర్చాల్సిందిగా మాల్దీవుల కోర్టు జారీ చేసిన రెండో అరెస్ట్ వారంటు రద్దయ్యినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: