గుడివాడ.. రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేకత ఉన్న నియోజకవర్గం. తెలుగుదేశానికి, ఎన్టీఆర్ కు వీరాభిమానిగా ఉన్న కొడాలి నాని ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాని.. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి వైసీపీలో చేరారు. జగన్ గూటిలో చేరి చంద్రబాబుపై పదునైన విమర్శలు చేశారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి.. 2014 ఎన్నికల్లో కొడాలి ఓడిపోవడం ఖాయమని అనుకున్నారు అంతా. కానీ నానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన బలమేంటో.. కొడాలి నాని నిరూపించారు.