అమెరికాకు అధినేతగా డోనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష రేసుకు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడ్డ ట్రంప్ అనూహ్య రీతిలో అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్నారు. 45వ అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన అమెరికా ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌కు ఊహించని పంచ్ ఇచ్చారు ట్రంప్. కీలకమైన స్వింగ్ స్టేట్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచడంతో ట్రంప్ పార్టీ ఈజీగా విక్టరీ కొట్టింది. మిడ్‌టౌన్ హిల్టన్ హోటల్లో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.