మళ్లీ బుజ్జగింపుల పర్వం మొదలయ్యింది , కాంగ్రెస్ అధిష్టానానికి ఇది అలవాటు అయినట్లుంది . రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు కలిశారు. తెలంగాణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని శనివారం లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిసి విజ్ఞప్తి చేశారు. సున్నితమైన జటిలమైన ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టడం మినహా శాంతిభద్రతలపై సీఎం కిరణ్ దృష్టి సారించడం లేదని ఫిర్యాదు చేశారు. తాము పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో పాల్గొనబోవడం లేదని ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో మంగళవారానికి అపాయింట్‌మెంట్ ఇచ్చి ఢిల్లీకి రండి అని ఆజాద్ వారిని చర్చలకు ఆహ్వానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: