ఈ మధ్య నోటి దురుసుతో షీలాదీక్షిత్ వార్తల్లోకి తరచుగా వస్తున్నారు, వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా విద్యుత్ చార్జీల భారం తగ్గించుకునేందుకు ప్రజలకు సరికొత్త ఉపదేశం చేశారు. కూలర్, ఏసీల బదులు ఫ్యాన్లు వాడుకోండి, ఇతర మార్గాలు చూసుకోండని , అంతేగానీ, రోజంతా వాడుకుంటాం, ఐదు గంటల బిల్లే చెల్లిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. భారమనిపిస్తే వాడకం తగ్గిస్తే సరన్నారు. ఆదివారం దక్షిణ ఢిల్లీలో ఓ సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగాలంటే పెంపును భరించాల్సిందేనని అన్నారు. షీలా సందేశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు విన్న తరువాత ఇక ప్రజలు షీలాని కాని తన ప్రభుత్వాన్ని కాని ఏ విధంగా నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: