పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ వీలైనంత త్వరగా ప్రజలకు తగినంత నగదును అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుపుతోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో రూ.500 కొత్త నోట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాద్లో మాత్రం రెండు వేల నోటు మినహా ప్రజలకు వేరే నోట్లు దొరకని పరిస్థితి ఉంది. కొన్ని ఏటీఎం కేంద్రాల్లోనే రూ.100 నోట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వచ్చే శనివారానికల్లా కొత్త రూ.500 నోట్లు హైదరాబాద్కు వచ్చేస్తాయని అధికారులు తెలిపారు. నోట్ల తరలింపు కోసం అధికారు