తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే డిమాండ్ మిత్రపక్షాల నుంచి గట్టిగా వినిపించింది. మంగళవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ నిర్వహించిన భేటీలో , కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుడా పాల్గొన్నారు. ఈ భేటీలో శరద్ పవార్ (ఎన్‌సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), టీఆర్ బాలు (డీఎంకే), అజిత్ సింగ్ (ఆర్ఎల్‌డీ) హాజరయ్యారు.  ఈ సందర్బంగా అజిత్‌సింగ్ ఉత్తరప్రదేశ్ నుంచి హరిత ప్రదేశ్ ఏర్పాటు గురించి ప్రస్తావించినట్లు సమాచారం, అలాగే శరద్ పవార్ కల్పించుకొని తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయనతో అజిత్‌సింగ్ కూడా గొంతు కలిపినట్లు తెలుస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణను ప్రస్తావించారు కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వీరు నొక్కి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్ట. 

మరింత సమాచారం తెలుసుకోండి: