ఈజిప్టులోని లక్సర్ నగరంలో పర్యాటకులతో వెళ్తున్న హాట్ ఎయిర్ బెలూన్‌కు ప్రమాదవశాత్తూ మంటలంటుకుని కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో బెలూన్‌లో ప్రయాణిస్తున్న 21 మందిలో 19 మంది మరణించారు. వారంతా ఆసియా, యూరోప్ కు చెందిన పర్యాటకులేనని భద్రతాధికారుల సమాచారం. బెలూన్ గాలిలో 1000 అడుగుల ఎత్తున పయనిస్తున్నప్పుడు అందులోని గ్యాస్ ట్యాంకుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 1989లో ఆస్ట్రేలియాలో రెండు బెలూన్లు గాల్లోనే ఢీకొనడంతో 13 మంది మరణించగా ప్రపంచంలో ఇదే అత్యంత ఘోరమైన హాట్ఎయిర్ బెలూన్ ప్రమాదమని భావిస్తున్నారు. 1996 లో ఉగ్రవాదుల దాడి తర్వాత పర్యాటకులను ఈ సంఘటన అత్యధికంగా బలిగొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: