హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న కొత్త భవనాలు పేకమేడలను తలపిస్తున్నాయి. నిర్మాణ లోపాలు ప్రజల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. అక్రమ భవన నిర్మాణదారులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. నిర్మాణ పనులు ఏ మాత్రం ఆగడం లేదు. నగరంలో నిర్మాణాలు చేపడుతూ..కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో సాధారణంగా పురాతన కట్టడాలు కూలిపోయే స్థితికి చేరుకుంటాయి. భారీ వర్షాలు కురిసే సమయంలో అవి మరింత ప్రమాదకరంగా మారుతుంటాయి.