మెక్సికోలోని బాణసంచా మార్కెట్లో జరిగిన భారీ పేలుడులో 26 మంది సజీవదహనమయ్యారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికో సిటీకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న టుల్టెపెక్లోని శాన్ పాబ్లిటో ఫైర్వర్క్స్ మార్కెట్లో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మార్కెట్ కిటకిటలాడుతోంది.