ప్రపంచీకరణ విధానాలు, సరళీకృత అమలులో భాగంగా బీడీ పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభాంలో కొట్టుమిట్టాడుతుంది. పగలనక, రేయనక ఆరుగాలం శ్రమటోడ్చి బీడీలు తాల్సిన కనీస వేతనాలు నోచుకోలేకపోతున్నారు. మరోవైపు రాజ్ బీహార్ బీడి పరిశ్రమ మూతపడింది. సరైన వస్తు ఉత్పత్తి లేకపోవడం వల్లనే బీడీ పరిశ్రమను నమ్ముకొని తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, పాలమూరు, అదిలాబాద్ తదతర జిల్లాల్లో 9లక్షలమంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమపై ఆదారపడి జీవనం సాగిస్తున్నారు. బీడిరంగంపై ఆదారపడిన లక్షలాదిమంది కార్మికుల బతుకులు వీధులపాలయినట్లే సరళీకరణ యుగంలో బీడీ కార్మికుల వేతనాల్లో ఎక్కువభాగం ఆహార పదార్థలకే వినియోగిస్తున్నారు. 3 లక్షలమంది కార్మికులకు సరిపడ ఆహారం దోరకడం లేదు. రోజుకు 2800కేలరీల శక్తి కావాల్సిఉండగా కేవలం 1700కేలరీల ఆహారమే దొరుకుతుంది. ఎంతో మంది బీడీకార్మికులు రక్తహీనతతో భాదపడుతున్నారు. తంబాకు వాసనతో ఎంతో మంది కార్మికులు క్యాన్సర్ రోగాల బారిన పడుతుండగా మరికొంతమంది టీబి వంటి రోగాలకు గురవుతున్నారు. నిత్యం కూర్చుండి బీడీలు చుట్టడంతో నడుంనొప్పులతో పాటు దృష్టి లోపం కూడా వస్తుంది. బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులున్నప్పటికిని అవి నామామాత్రంగానే పనిచేస్తున్నాయి. బీడీకార్మికులకు కనీసవేతనాలు జీవో 41అమలయితే వెయ్యిబీడీలకు 158రూపాయలు అమలులో ఉంటాయు. వీటిని అమలు చేయకుండా ప్రభుత్వం యాజమాన్యులకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది. 11 లక్షల మంది కార్మికుల కంటే యాజమాన్యాలే ప్రభుత్వానికి ఎక్కువై పోయారు. బీడీ పరిశ్రమాలు ఎక్కువగా తెలంగాణాలో ఉన్నాయి. సిగరేట్లు రావడంతో బీడీల ప్రాధాన్యం తగ్గి బీడీల పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయు. కరీంనగర్ ఉప ఎన్నికల్లో బీడీ కార్మికుల అజెండా తో వివిధ పార్టీల నేతల అభ్యర్ధులు ఎన్నికల భరిలో నిలిచారు. బీడీ కట్టల పై పుర్రేగుర్తుతో ముద్రంచి బీడీలు తాగడం వలన క్యాన్సర్స్ వంటి రోగాలు వస్తాయని ఆరోగ్యానికి హానికరమని కేంద్రం నిషేధించడంతో పెద్ద పెట్టున బీడీ కార్మిక వర్గమంతా పోరాడి బీడి పరిశ్రమ సాధించుకున్నారు. కాగా అదే విధంగా కనీసవేతనం 121 రూపాయల నుంచి 158 రూపాయల పెంచేంత వరకు యాజమాన్యాయాలను నిలదీయాలి. బీడీ కార్మీకుల హక్కుల సాధనలో కదన రంగంలో ముందుండి నడవాలి. అలా పోరాడినాడే బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించబడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: