హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన హడావిడంతా ఉత్తిదేనని తేలిపోయింది. దాదాపు 40రోజుల తర్వాత ఎన్ఐఏ అధికారులు బాంబు పేలుళ్ల కేసులో రెండు ఎఫ్ఐఎర్ లు నమోదు చేసింది. ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో ఉగ్రవాద సంస్థలకు చెందిన అనుమానిత వ్యక్తులు పేలుళ్లకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. పేలుళ్లకు పాల్పడని ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాదుల పేర్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తాయని భావించినా... గుర్తుతెలియని వ్యక్తులుగా పేర్కొనడంతో ఏమీ తేల్చలేనట్టు అర్థమవుతోంది. కేంద్రం దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై అధ్యయనం చేయడానికి పది మందితో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించింది వీరంతా పలుమార్లు సంఘటనా ప్రాంతాలను పరిశీలించారు. అయినా ఏమీ తేల్చలేకపోవడంతో... ఎన్ఐఏ దర్యాప్తు తంతు అంతా కొండను తవ్వి ఎలుకను పట్టుకుందన్న సామెతను గుర్తు చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: