ప్రముఖ న్యాయవాది, పార్టీ సీనియర్ నేత రాంజఠ్మలానికి బిజిపి రాంరాం చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈమద్య ఆయన బిజేపి అగ్రనేతలను బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇదే కారణంతో రాంజఠ్మలానిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించడానికి కారణమట.

ఇప్పటికే బిజేపి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ బహిరంగ విమర్శలపై వివరణ ఇవ్వాలని రాంజఠ్మలానికి సస్పెన్షన్ నోటీసులిచ్చారు. అయినా సరే నోటీసుకు జఠ్మలాని బదులివ్వలేదు, పైగా మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ కమిటి సమావేశంలోకి హఠాత్తుగా జఠ్మలాని ప్రవేశించి యూపిఏ ప్రభుత్వంపై సరిగా స్పందించడం లేదంటూ మళ్లీ పార్టీ నేతలపై విరుచుకు పడ్డారు.

అంతటితో ఆగకుండా తనకు నోటీసు ఇచ్చి మూడు నెలలయింది, తన బహిష్కరణ పై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, లేదంటే తనకిచ్చిన సస్పెన్షన్ నోటీసు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో దిమ్మతిరిగిన బిజేపి అగ్రనాయకత్వం, తిట్టినా పడి, చివరకు బహిష్కరించండి అని బాజాప్త అడిగానాక కూడా వేటు వేయకపోతే పరువుపోతుందని అర్జెంటుగా బహిష్కరించేందుకు రంగం సిద్దంచేసినట్లు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: