బెల్టుషాపుల గూర్చి వినతి చేస్తే ఫుల్లు బాటిలెత్తి తాగినట్టు తెగ సిరాక్కా మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కు ఎక్కిన కిక్కు దిగినట్టుంది. దెబ్బకు బాబ్బాబు నేనలా అనలేదు అంటూ లబోదిబో మన్నారు. బెల్టు తీయనని నేనలేదు, దానికి తోడుగా కల్తీ కల్లును కూడా అరికట్టాలన్న ఆలోచన ఉంది అంటూ తన కార్యాలయం ద్వారా ప్రకటన జారీ చేసి తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డారు సిఎం కిరణ్.

సర్,  బెల్టు షాపులు నెలరోజుల్లో తీసేస్థామన్నారు, కనీసం 45 రోజుల్లో నైనా తొలంగించండి అంటూ మద్యనియంత్రణ కమిటి సభ్యులు సిఎం కిరణ్ వెలిసి వినతిపత్రం సమర్పించి మొరపెట్టుకున్నారు. అసలే సరిపడా ఆదాయం లేక అమ్మహస్థం లాంటి పథకాలు పడకేస్థుంటే ఉన్న దానికి ఎసరుపెడుతున్నారంటూ తెగ చిరాకుపడ్డ సిఎం కిరణ్ బెల్టే బెటరు, ఎవరు చావరు, లేదంటే కల్తీకళ్లు, గుడుంబా తాగి జనం చస్థారు, ఇక వెల్లండి అన్నారు.

advertisements

బయటకు వచ్చిన మద్యనియంత్రణ కమిటీ సభ్యులు ఏకంగా బెల్టు షాపులపై సిఎం మాట మార్చారని, ఉద్యమానికి కార్యరూపం ఇచ్చే పనిలో పడ్డారు. రవీంధ్రభారతిలో మాట తప్పిన సిఎం వైఖరిని ఎండగట్టడానికి, బెల్టు షాపుల తొలగింపుకు ఉద్యమం రూపం ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేసారు. దీంతో దిమ్మతిరిగిన సిఎంకు మత్తు దిగింది. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సిఎం కార్యాలయం నుంచి ప్రకటన జారీచేసారు.

తాను బెల్టు షాపులు తొలగించను అని అనలేదు, నామాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు, నిజానికి బెల్టుషాపులకు తోడుగా, ప్రజల ప్రాణాలు తీస్థున్న కల్తీకళ్లు, గుడుంబా ను కూడా అరికట్టే కార్యాచరణ తయారు చేస్థున్నానంటూ ప్రకటన జారీ చేసారు. అయినా అవును, కాదు అన్నపదాలకు కూడా తేడా తెలియని వారున్నారని సిఎం అనుకుంటే ఎవరేం చేస్థారు చెప్పండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: