ఒక్కక్క అడుగూ ముందుకు వేస్తూ నాయకత్వ బలోపేతానికి కాంగ్రెస్ వ్యూహం రచిస్తోందా… రాహుల్ కి అండగా నెహ్రూకుటుంబం నుంచి మరొక వ్యక్తి పెద్ద పాత్ర పోషించబోతున్నారా… కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు అదే సంకేతాల్ని ఇస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి తనయ కీలకపాత్ర పోషించబోతోంది. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో పొందుపరిచింది.


యూపీ ఎన్నికల కోసం నియమించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రియాం గాంధీకి చోటు కల్పించింది. ఇలా అధికారికంగా ఆమె పెద్ద పాత్ర పోషించడం ఇదే తొలిసారి. గతంలో తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ పోటీ చేసిన అమేథీ, రాయ్ బరేలీల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గాల వెలుపల ప్రచార బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది.


యూపీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కూడా కీలకంగా మారాయి. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కూడా ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల నుంచి పోటీకి దిగుతోంది. సమాజ్ వాదీ పొత్తు విషయంలోనూ ప్రియాంక ముఖ్యపాత్ర పోషించారని కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది. ఈ ఉత్సాహంలోనే ఆమె సేవల్ని ప్రచారంలోనూ విరివిగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అనుభవంతోనే రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటే యూపీ రాజకీయాలకు ప్రియాంకని కేంద్ర స్థానంగా మార్చాలని పలువురు సీనియర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. 


ఇప్పుటికే వయోభారం, ఆరోగ్య సమస్యల రీత్యా సోనియా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాకం ఆగమనం పార్టీలో కొత్త శక్తులు నింపుతుందని భావిస్తున్నారు. యూపీ సక్సెస్ స్టోరీని బట్టి కాంగ్రెస్ లో ప్రియాంక పాత్ర రూపాంతరం చెందుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: