అన్నన్నా... మమ్మలను ఎన్ని తిప్పలు పెట్టావు ధర్మాణా... అంత ఈజీగా వదులుతామా, జైల్లో పెట్టేవరకు వదలా ధర్మాణా... నిన్ను వదలా అంటోంది సిబిఐ. జగన్ అక్రమాస్థుల కేసులో మాజి మంత్రి ధర్మణ ప్రసాదరావును కస్టడీలోకి తీసుకునేందుకు సిబిఐ సుప్రీం కోర్టుకు వెల్లేందుకు నిర్ణయించింది.

ఈ కేసులో ధర్మాణను విచారించేందుకు మొదట సిబిఐ విశ్వప్రయత్నాలు చేసింది, దానికి ప్రభుత్వం అనుమతి కావాలంటూ మెలిక పెట్టిన ధర్మాణ సిబిఐ ఎంత ప్రయత్నించినా చిక్కలేదు. చివరకు సిబిఐ రాజ్యాంగాన్నంతా శోదించి ధర్మాణ విచారణకు ప్రభుత్వ ఆమోదం అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించినా పలితం దక్కలేదు.

 బాగా ఆలోచించిన సిబిఐ ధర్మాణపై పిసియాక్ట్ కింద కేసు నమోదు చేసింది, ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవి ఊడడంతో వేగం పెంచిన సిబిఐ ఆయనను కోర్టుదాకా లాగి బోనెక్కించింది. అంతటితో ఆగకుండా ఆయనను అరెస్టు చేసి జైలుపాలు చేసేందుకు సిబిఐ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసింది, అయితే అక్కడా సిబిఐ విజయం సాధించలేదు.

 ఎలాగైనా సరే ధర్మాణను వదలొద్దని సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు కూడా ధర్మాణ కస్టడీ పిటిషన్ ను తిరస్కరించింది, దీంతో పిసి యాక్టు కింద ధర్మాణను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమైంది సిబిఐ, అక్కడ ఎవరు గెలుస్థారో వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: