ఈ దేశం ఎప్పుడూ చూడని పరిస్థితి ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధి లో తమిళ రాజకీయం మొత్తం మారిపోయింది. మొన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న శశికళ - పన్నీర్ సెల్వం లు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం చూస్తున్నాం. ఒక ఆసక్తికర సంఘటన , సన్నివేసం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కనిపిస్తోంది. నిన్న ఉదయం వరకూ పన్నీర్ దగ్గర దాదాపు యాభై మంది ఎమ్మెల్యే లు ఉన్నారు అన్న వార్తలు వచ్చాయి. ఆ మధ్య 35 మంది పన్నీర్ పక్షాన ఉంటే నిన్నటికల్లా యాభై మంది వచ్చారు అనే వార్త వినపడింది.


అనూహ్యంగా చిన్నమ్మ నిర్వహించిన మీటింగ్ లో 130 మంది ఎమ్మెల్యే లు ఆమె కి మద్దతుగా వెళ్ళిపోవడం తో పన్నీర్ కి బలమే లేదు అని తేలిపోయింది. పది మంది ఎమ్మెల్యే లు కూడా అతనితో లేకుండా పన్నీర్ ఏ ధైర్యం తో చిన్నమ్మతో యుద్ధం ప్రకటించాడు అనేది అర్ధం కాని ప్రశ్న. తమిళనాడు రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం.. చివరి క్షణం వరకూ పన్నీరు వర్గంలో ఉన్నట్లుగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని.. సమయం వచ్చినప్పుడు తామేంటో చూపించాలన్న ఆలోచనలో పన్నీర్ వర్గం ఉందని చెబుతున్నారు.


ఇదేమీ సినిమా కాదు అనీ ప్రజల జీవితాల మీద ప్రభావం చూపే రాజకీయం కాబట్టి సాగదీయకుండా ఉండాలి అనేది కొందరి మాట. ఎమ్మెల్యే లని బస్సులలో ఎక్కించి మరీ హోటల్ కి తీసుకురవాదం వెనక అందరూ విస్మయం చెందుతున్నారు. ముందుగా ఈ విషయం పార్టీ లో ఎక్కడా పొక్కకుండా పార్టీ ఎమ్మెల్యే లు అందరినీ రహస్య ప్రాంతానికి తరలించారు అనే వాదనా ఉంది. పన్నీర్ తో ఉన్న కొద్దో గొప్పో మంది ఎమ్మెల్యే లు మామూలుగా శశికళ మీటింగ్ కి వెళ్లి ఆమె ప్లాన్ కి పడిపోయారు అనే మాటలూ వినపడుతున్నాయి. చేతిలో ఎమ్మెల్యేలు లేకున్నా..  సోషల్ మీడియా.. సెలబ్రిటీ వర్గాలు.. ప్రజల్లోనూ పన్నీర్ పట్ల ఆదరణ ఉండటం గమనార్హం. మరి.. జీరో స్కోర్ లో ఉన్న పన్నీర్.. 130 మంది ఎమ్మెల్యేలున్న చిన్నమ్మతో ఎలా తలపడతారు?  అనేది పెద్ద ప్రశ్న

 


మరింత సమాచారం తెలుసుకోండి: