తమిళనాడు శాసనసభలో పళనిస్వామి ప్రభుత్వం ఉంటుందా ... పడిపోతుందా.. అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మీడియా మొత్తం తమిళనాడు పైనే ఫోకస్ చేసింది. మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. పళని ప్రభుత్వం పడిపోయే సూచనలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఎలా అంటే.. ప్రస్తుతం డిఎంకేకు 89, పన్నీరు సెల్వం వెంట 11మంది, కాంగ్రెస్ 8, ఇతరులు 1 ఉన్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలను పళనిస్వామి వర్గం నుంచి లాక్కుంటే.. ప్రభుత్వం పడిపోతుందనేది మీడియా కథనాలు.


వాస్తవానికి అది సాధ్యమేనా అనే ప్రశ్న అందరి మదినీ తొలచివేస్తుంది. పళనిస్వామి వర్గం తమకు 124మంది ఎమ్మెల్యేల మద్దతుందని స్పీకర్ కు ఇచ్చిన లేఖలో పేర్కొంది. మీడియా చెబుతున్న ప్రకారం 10మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీలు పట్టుకుపోతే.. పళనిస్వామికి 114మంది మద్దతే ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 117కావడంతో... ప్రభుత్వం కూలిపోయే ప్రమాద ముందనేది వారి వాదన. ఇది తప్పంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇదంతా ఎప్పుడు జరుగుతుంటే.. చివరి నిమిషం వరకు.. పళని వర్గంలో ఎవరెవరు పన్నీరు సెల్వానికి మద్దతిస్తారో తెలియనప్పుడే. సాధ్యం. పూర్తి వివరాల్లోకి వెళితే.. బలపరీక్ష వేళ స్పీకర్ రహస్య ఓటింగ్ కు అనుమతిస్తే.. 10మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఓటు వేసినా కూలిపోయే అవకాశముంది. అలా కాకుండా.. ఓపెన్ ఓటింగ్ పెట్టినా.. లాస్ట్ సెకన్ వరకు పన్నీరుకు మద్దితిచ్చే వారు బయటపడకుండా.. ఓటింగ్ కు లేవమన్నడు వ్యతిరేకంగా ఓటు వేసినా ప్రభుత్వం పడిపోతుంది. 


అలా కాకుండా.. పన్నీరు సెల్వానికి పలానా వారు మద్దతిచ్చే అవకాశముందని ఏమాత్రం పళని వర్గానికి అనుమానం వచ్చినా వారిపై వేటు వేసే అవకాశముంది. ఎందుకంటే.. ఇప్పటికే ప్రభుత్వం విప్ జారీ చేసింది. అందరూ పళనిస్వామికి తప్పనిసరిగా ఓటు వేయాలని. స్పీకర్ ధన్ పాల్ పళనిస్వామి వర్గమే కాబట్టి.. ఎవరైనా వ్యతిరేక వర్గం అని తెలియగానే.. ఓటింగ్ కు ముందే వారిపై అనర్హత వేటు వేసే అవకాశముంది.


ఉదాహరణకు ఓ పది మంది పన్నీరు మద్దతిస్తారని తెలిస్తే.. వారిపై అనర్హత వేటు వేస్తారు. పన్నీరు వద్ద ఎలాగూ 11మంది ఉన్నారు. వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తారు.. అప్పుడు ప్రభుత్వానికి ఉన్న 124మందిలో 10 అనర్హులుగా వెళ్లిపోతే.. ఉండే వారి సంఖ్య 114, అప్పుడు ప్రతిపక్షానికి ఉన్న బలం డిఎంకే 89, కాంగ్రెస్ 8, ఇతరులు 1 మొత్తం 98. అంటే ప్రతిపక్షానికి కంటే.. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నట్లు లెక్క. సో ప్రభుత్వం గట్టెక్కిపోతుంది. మొత్తం మీద పళనిస్వామి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గాలన్నా.. ఓడిపోవాలన్నా మొత్తం స్పీకర్ ధన్ పాల్ చేతుల్లోనే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: