ఇండియా- పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలు  జరిగాయి. అవన్నీ కాశ్మీర్‌ లోయలోనో, దేశ సరిహద్దుల్లోనో జరిగాయి. అవన్నీ చరిత్రకు తెలిసేలా జరిగాయి. కానీ ఓ యుద్ధం మాత్రం ఎవరికీ తెలియకుండా జరిగింది. అదీ మన ప్రాంతంలో జరిగింది. దాదాపు అర్ధ శతాబ్ధం క్రితం సముద్రం అడుగున జరిగిన ఈ యుద్ధం.. చరిత్రలో అట్టడుగున పడిన ఓ సత్యం. అదే ఘాజీ.


ఘాజీ... ఓ జలాంతర్గామి. ఈ పేరు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆల్‌మోస్ట్‌ ఇండియా అంతటా మార్మోగుతోంది. ఇంతకాలం ఎవరికీ పెద్దగా పరిచయం లేనిదైనా ఇప్పుడు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతమంది ఈ పేరునే పలవరిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సబ్‌మెరైన్‌ ఇండియాదే అనుకుంటున్నారా? అలా అనుకున్న వారంతా పప్పులో కాదు కాదు నడి సముద్రంలో కాలేసినట్లే. ఎందుకంటే... అది మన దాయాది దేశం, మనకు పక్కనే ఉన్నా చిరకాల ప్రత్యర్థి, ప్రస్తుతం భారతీయులందరూ పాపిస్తాన్‌గా పిలుస్తున్న పాకిస్తాన్‌ దేశానిది.


ఇంతకీ పాక్‌కు చెందిన ఘాజీతో మనకు పనేంటి? దీనితో  విశాఖపట్నానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది.. అలాంటి ఇలాంటి సంబంధం కాదు.. ఆ చరిత్ర తెలుసుకుంటే గుండెలు గుభేల్‌మంటాయి. ఎందుకంటే... ఈ సబ్‌మెరైన్‌ సరిగ్గా 47ఏళ్ల క్రితం విశాఖ వినాశనం కోసం వచ్చింది. స్టీల్‌ సిటీ వాసుల బతుకులను బాంబుల దాడితో బుగ్గిపాలు చేయాలనుకుంది. తీర ప్రాంతంలో తీరని వేదనను మిగిల్చాలని అనుకుంది.


ఇంతటి కుట్రతో  విశాఖ చెంతకు వచ్చిన ఈ పాక్‌ అస్త్రాన్ని... మన నేవీ ముందే పసిగట్టింది. పక్కా ప్రణాళికతో దాని ఆట కట్టించింది. సాగరంలోనే ముంచేసింది. కనిపించకుండా వచ్చిన దానిని బాహ్య ప్రపంచానికి కనిపించకుండా చేసింది. అదే చేసుండకపోతే... నేవీ అంతటి పరాక్రమాన్ని చూపించి ఉండకపోతే ఇప్పుడు మనం చూస్తున్న విశాఖ, తిరుతుగున్న తీరప్రాంతం చరిత్ర పుటల్లో కలిసిపోయేది. ఆనాడు ఓ నగరం ఉండేది అని చెప్పుకోవాల్సి వచ్చేది.


ఈనాటి సుందర నగరాన్ని మనం చూస్తున్నామంటే.. ప్రకృతి అందాల ఒడిలో ఓలలాడుతున్నామంటే.. అది మన నేవీ దయ వల్లే. ఆనాడు చూపిన సత్తా వల్లే. 


మరింత సమాచారం తెలుసుకోండి: