గ‌తేడాది అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యవహా రాన్ని దాదాపు వైసీపీ కూడా మర్చిపోయింది. అయినా టీడీపీ మాత్రం ఇప్పటికీ దాన్ని సీరియస్ గానే పరిగణి స్తోంది. తాజాగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ నలుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని సభ్యులుగా నియమించారు. 


రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడంపై విమర్శలు రాడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏడాదిపాటు సస్పెన్షన్ సరైనదేనా? ఆమెకు వేసిన శిక్ష తక్కువా? లేక ఎక్కువా? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని స్పీకర్ ఆదేశించారు. కమిటీ నియా మకంతో అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో పాటు రోజా సస్పెన్షన్ కు దారి తీసిన పరిణామాలపై ఈ సభ్యుల బృందం పూర్తి నివేదికను అందించారు. 

అయితే అధికారపక్షం విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లో కేవలం రోజాతో పాటు వైసీపీ నేతల తిట్లనే చూపిం చారు, టీడీపీ వాళ్లు అన్న మాటలను కూడా చూపించాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ ను ఈకమిటీ పరిగిణలోకి తీసుకోనుంది. రోజా వ్యవహారంతో పాటు ఆరోజు సభలో ఏంజరిగిందన్న దాన్ని కూడా కమిటీ బయటపెడితే బాగుంటుందని వైసీపీ కోరుతుంది.  ఒకవేళ కమిటీలో తమ సూచనలకు విలువ లేకపోతే వైదొలగాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. దీనికి వైసీపీ నేతలు కారణాలు కూడా చూపిస్తున్నారు. 

కమిటీలో ఉన్న సభ్యుల్లో ముగ్గురు కూడా అధికారపక్షానికి మద్దతుగా ఉంటారని.. మిగిలిన ఒక్కరు ఏం సూచ నలు చేసినా మెజారిటీ సభ్యుల మాట లే పరిగణలోకి తీసుకుంటారని వైసీపీ అంటోంది. ఇక పోతే తాజాగా 2017-18 ఆర్థిక బ‌డ్జెట్ స‌మావేశాల్లో  ‘ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేస్తారా? పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులపైనా వేటు వేస్తారా? అధికారపక్ష వ్యూహం ఎలా ఉంది?’ వంటి పలు ప్రశ్నలు వైసీపీని తొలచివేస్తున్నాయి.  

ఈ అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తే రోజాను మళ్లీ ఏడాదిపాటు సస్పెండ్‌ చేస్తారేమోనన్న ఆందోళన వైసీపీ లో కనిపిస్తోంది. సభలో అనుచితంగా ప్రవర్తించా రంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముత్యాలనాయుడు, రాజా, శ్రీని వాసులు, రామకృష్ణారెడ్డి తదితరులను ప్రివిలేజ్‌ కమిటీ విచారించింది. తన నివేదికను స్పీకర్‌కు అందించింది. 
ఈ నివేదికలు మంగళవారం సభలో ప్రస్తావనకు వస్తాయేమోనని వైసీపీలో చర్చ జరుగుతోంది. 

దీంతో  నేతలం దరూ టెన్షన్‌‌గా గడుపుతున్నారు. కారణం అసెంబ్లీలో రోజా, ఇతర ఎమ్మెల్యేల అనుచిత వ్యా ఖ్యలు. ఇప్పుడవే వారి మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారపక్షం వ్యూహం ఏంటో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ నివేదికలపై ప్రస్తావన ఉంటుందేమోనన్న గుబులు ఇప్పుడు వైసీపీలో మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: